విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దారుగా విధులు నిర్వహిస్తున్న నటరాజ్ చిలమత్తూరు మండల తాసిల్దారుగా ఇటీవల బదిలీ అయ్యారు. తదుపరి వీరి స్థానంలో తహసిల్దారుగా ప్రభుత్వం ఎవరిని నియమించలేదు. దీంతో పరిపాలన విభాగం పాలనలో భాగంగా ఉప తహసిల్దారుగా విధులు నిర్వర్తిస్తున్న సురేష్ బాబును ఫుల్ అడిషనల్ చార్జ్ ఎమ్మార్వో గా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో వారు పదవి బాధ్యతలను స్వీకరించడం జరిగింది. అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ మండలంలోని ప్రజలకు, పట్టణ ప్రజలకు సమస్యలను పరిష్కరించడంలో తాను కృషి చేస్తానని, నిరంతరం ప్రజలకు అండగా ఉంటానని, చట్టపరంగా న్యాయపరంగా అందరికీ న్యాయం చేకూర్చుతానని తెలిపారు. కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది సహాయ సహకారములతో అభివృద్ధి చేస్తానని తెలిపారు. తదుపరి కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలు, ఆర్ ఐ, సిఎస్డీటి తదితరులు నూతన ఎఫ్ఎసి తాసిల్దార్ సురేష్ బాబుకు శుభాకాంక్షలు అని తెలియజేశారు.
ఎఫ్ ఏ సి తాసిల్దారుగా సురేష్ బాబు
- Advertisement -
RELATED ARTICLES


