విశాలాంధ్ర-రాప్తాడు : అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి ‘స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయం’ విభాగంలో విశిష్ట అవార్డు లభించడం అధికారుల, సిబ్బంది సమష్టి కృషికి దక్కిన తగిన గుర్తింపుగా నిలిచింది. కార్యాలయ ఆవరణలో పరిసరాల పరిశుభ్రతను నిరంతరం కాపాడుతూ, ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలందించడంలో అధికారులు, సిబ్బంది చూపుతున్న ప్రత్యేక చొరవకు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛత ప్రమాణాలను పెంచడానికి, పాలనను మెరుగుపరచడానికి అధికారులతో కలసి సమన్వయంతో కృషి చేసిన ఎంపీడీఓ విజయలక్ష్మికి డిప్యూటీ ఎంపీడీవోలు అశోక్ బాబు, అచ్యుతానంద బాబు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ భానురేఖ, వి. బిజీ రామ్ జీ మరియు కార్యాలయ సిబ్బంది హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.


