Homeజిల్లాలుఅనంతపురండా. ఎం. మాధుర్యకు ప్రతిష్ఠాత్మక ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు అవార్డు

డా. ఎం. మాధుర్యకు ప్రతిష్ఠాత్మక ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు అవార్డు

- Advertisement -

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అనంతపురం: ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు ఏ యిమ్స్ మంగళగిరిలో నిర్వహించిన 12వ ఆపిరియా రాష్ట్ర ప్రోఫ్ . కాకర్ల సుబ్బారావు అవార్డు ఫర్ బెస్ట్ రెసిడెంట్స్ పేపర్ వైద్య కళాశాల, అనంతపురంకు చెందిన డా. ఎం. మాధుర్య ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రులకు చెందిన రెసిడెంట్ వైద్యులు తమ పరిశోధనా పత్రాలను ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో సమర్పించారు. ఈ పోటీలో డా. ఎం. మాధుర్య సమర్పించిన పరిశోధనా పత్రం అత్యుత్తమంగా నిలిచి, ప్రోఫ్ . కాకర్ల సుబ్బారావు అవార్డు ఫర్ బెస్ట్ రెసిడెంట్స్ పేపర్ సొంతం చేసుకుంది.ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం ప్రిన్సిపాల్ మరియు అదనపు డి ఎం ఈ డా. ఎం. విజయశ్రీ , వైస్ ప్రిన్సిపల్స్, రేడియాలజీ విభాగాధిపతి డా. బి. సురేష్, ఇతర విభాగాధిపతులు, రేడియాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్లు డా. రాజేంద్ర నాయుడు మరియు డా. ఓ. మనోరంజన్ రెడ్డి ఇతర వైద్యులు డా. ఎం. మాధుర్యను అభినందించారు.డా. మాధుర్య సాధించిన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురానికి గర్వకారణమని, వైద్య విద్యతో పాటు పరిశోధనా రంగంలోనూ కళాశాల ప్రతిభను చాటిచెప్పిందని వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు