Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాప్తాడు

అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాప్తాడు

- Advertisement -

ఎమ్మెల్యే పరిటాల సునీత చొరవతో రూ. 1.13 కోట్ల సీసీ రోడ్లకు వైభవంగా భూమిపూజ

విశాలాంధ్ర-​రాప్తాడు : నిరంతరం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాప్తాడు గ్రామం ప్రగతి దిశగా మరొక పూర్ణ అధ్యాయానికి ముందడుగు వేసింది. ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక చొరవతో, టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి ప్రత్యేక శ్రద్ధతో గ్రామానికి మంజూరైన రూ. 1 కోటి 13 లక్షల విలువైన పలు అభివృద్ధి పనులకు గురువారం వేద మంత్రోచ్ఛారణల నడుమ అత్యంత వైభవంగా భూమిపూజ నిర్వహించారు. గ్రామంలో రవాణా సౌకర్యాలను అత్యాధునికంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపడుతున్న ఈ పనుల్లో భాగంగా రూ. 1 కోటి అంచనా వ్యయంతో నిర్మించనున్న ‘రాప్తాడు – జేఎన్టీయూ ప్రధాన రహదారి’తో పాటు, రూ. 13 లక్షల వ్యయంతో గ్రామంలో మరో 3 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. నాణ్యమైన బీటీ, సీసీ రహదారుల నిర్మాణంతో గ్రామ ముఖచిత్రం పూర్తిగా మారనుండడమే కాకుండా, గ్రామ ప్రజలకు, కళాశాల విద్యార్థులకు సుదీర్ఘకాలంగా ఉన్న రాకపోకల కష్టాలు శాశ్వతంగా తొలగిపోనున్నాయి. ఈకార్యక్రమంలో ఎంపీడీవో బి. విజయలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీవో అశోక్ బాబు, అచ్యుతానంద బాబు, టీడీపీ మండల కన్వీనర్ పంపుకొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి శీనా, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు