Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆకస్మిక తనిఖీలు చేపట్టిన తహసీల్దార్ సురేష్ బాబు

ఆకస్మిక తనిఖీలు చేపట్టిన తహసీల్దార్ సురేష్ బాబు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం తాసిల్దార్ సురేష్ బాబు పట్టణంలో పలు ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఇందులో భాగంగా మార్కెట్ యార్డ్ నందు కందుల నుండి రైతులు కొనుగోలు కేంద్రాన్ని, పౌర సరఫరాల గోడవును, గొట్లూరు గ్రామ సచివాలయం నూ తనిఖీ చేశారు. అనంతరం తాసిల్దార్ హాజరు పట్టికను పరిశీలించారు. ప్రతిరోజు పేస్ యాప్ ద్వారా హాజరుకావాలని రైతుల నుండి పట్టాదార్ పాస్ పుస్తకాల విషయంలో రికార్డులను పరిశీలించి ఎవరి ప్రమేయం లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా జడ్పీ ఉన్నత పాఠశాలనందు వంటశాలను తనిఖీ చేసి పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని లేనియెడల కఠిన చర్యలు తీసుకోబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి, రెవెన్యూ అధికారులు, గ్రామ సేవకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు