.విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్వో గిరిధర్ రెడ్డి పై చర్యలు గైకొనాలని బాధితులు వాపోయారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మండల పరిధిలోని పోతుకుంట గ్రామానికి చెందిన మహిళ రైతు శ్రీ లత తన బాధను వ్యక్తం చేసింది. నా భూమి కి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను వీఆర్వో బీరువాలో పెట్టుకుని నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నాడని తెలిపింది. అంతకుమునుపే వీఆర్వో ఓ రైతు గొడవ పడుతుండగా, మధ్యలో జోక్యం చేసుకొని నా విషయంలో కూడా వీఆర్వో పనిచేయటం లేదని, బాహాటంగా మూడు లక్షల రూపాయలు లంచం ఇస్తేనే పని చేస్తారని తెలిపాడని ఆమె వాపోయింది. దీంతో ఆవరణంలో ఉన్న ఓ వ్యక్తి ఆ గొడవ దృశ్యాన్ని సెల్ ద్వారా తీసి సోషల్ మీడియాకు పంపడంతో అది వైరల్ గా కొనసాగింది. దీంతో ఆర్డీవో మహేష్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో సురేష్ బాబు వీఆర్వో అయిన గిరిధర్ రెడ్డి పై విచారణ జరిపి, నివేదికను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలిపారు.
వీఆర్వో గిరిధర్ రెడ్డి పై చర్యలు గైకొనండి ..బాధితుల ఆవేదన
RELATED ARTICLES