డాక్టర్ పద్మ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పార్థసారధి నగర్, పుట్టపర్తి రోడ్, ఎర్రగుంట వద్దగల దేవి నర్సింగ్ హోమ్ లో ఈనెల 11వ తేదీ బుధవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఉచిత సంతాన సాఫల్య అవగాహన శిబిరమును నిర్వహిస్తున్నట్లు దేవీ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు పుట్టకపోవడం అనేది చికిత్స చేయదగిన మరొక వైద్య స్థితి అని వారు తెలిపారు. డాక్టర్ లావణ్య డాక్టర్. ఎస్. పద్మావతి ల ద్వారా ఆరోగ్య స్థితిని గూర్చి తెలియపరచడం జరుగుతుందన్నారు. గర్భం దాల్చిన కూడా ఫలితం లేకపోవడం, ఐ యు ఐ లేదా ఐవిఎఫ్ వైఫల్యాలు ఉండడం, గర్భం దాల్చినప్పుడు రిపోర్టులు మామూలుగా ఉన్నప్పటికీ గర్భం దాల్చలేకపోవడం, పి సి ఓ ఎస్ సమస్యలు, ఫాలో పియన్ ట్యూబ్ పోవడం, ఇలాంటి సమస్యలపై చక్కటి నివారణ మార్గం ఈ శిబిరంలో ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 81073250కు గాని 9912031139 కు గాని సంప్రదించాలని తెలిపారు.
ఉచిత సంతాన సాఫల్య అవగాహన శిబిరమును సద్వినియోగం చేసుకోండి..
RELATED ARTICLES