Thursday, December 5, 2024
Homeజిల్లాలుధర్మవరంలో గురుకుల పాఠశాల భవన నిర్మాణం చేపట్టండి..

ధర్మవరంలో గురుకుల పాఠశాల భవన నిర్మాణం చేపట్టండి..

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ లేఖ

విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరంలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల భవన సముదాయ నిర్మాణానికి సంబంధించిన పనులు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మంగళవారం లేఖ రాశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో అత్యధిక వెనుకబడిన తరగతుల విద్యార్థులు నివసిస్తున్నారని, వీరు గురుకుల పాఠశాలలో విద్యాభ్యసించాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జీవో నెంబర్ 12 ద్వారా ధర్మవరానికి మంజూరైన మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభించడానికి అనుగుణంగా భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రిను కోరడం జరిగిందన్నారు.పాఠశాల నిర్మాణం కోసం గతంలో కేటాయించిన రూ.36 కోట్ల నిధులకు అదనంగా తాజా అంచనాలకు అనుగుణంగా నిధులు కేటాయించి వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న కూటమి ప్రభుత్వ ఆకాంక్షను నెరవేర్చాల్సిందిగా మంత్రికోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు