Wednesday, April 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి

యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు పదవ తరగతి స్పాట్ వాల్యూషన్లో మినహాయింపు ఇవ్వాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు సెట్టిపి జయచంద్ర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 3న నిర్వహించబోయే పదవ తరగతి స్పాట్ వేల్యూషన్ సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ , విజువల్లీ ఛాలెంజ్డ్ ,ఉపాధ్యాయులకు, 58 సంవత్సరాలు నిండినవారు, మానసిక రుగ్మత (మెంటలీ రిటర్టెడ్) పిల్లలు ఉన్నా వారికి, వ్యక్తిగత లెటర్లు తీసుకొని ముందుగానే వారి కోరిక మేరకు స్పాట్ నుండి మినహాయింపు ఇవ్వాలని వారు తెలిపారు. యుటిఎఫ్ జిల్లా శాఖ పక్షాన శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖాధికారి కిష్టప్ప , ధర్మవరం ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేయడం జరిగింది అని తెలిపారు. అలాగే ఎస్ జి టి లకు లకు స్పెషల్ అసిస్టెంట్ డ్యూటీలు 25 సంవత్సరాలు సర్వీస్ నిండి, 50 ఏళ్లు పైబడి ఎస్జీటీలుగానే పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకు స్పెషల్ అసిస్టెంట్ డ్యూటీలు నుండి మినహాయింపు ఇవ్వాలని, అలాగే ఏలూరు చుట్టుపక్కల మండలాలకు సమాన ప్రాతినిధ్యంలో డ్యూటీలు వేయాలని, జిల్లా నుండి దూర ప్రాంతంలో ఉన్న మండలాలకు ఎక్కువ దూరం వెళ్తున్న ఉపాధ్యాయులు వారి కోరిక మేరకు డ్యూటీలు వారి విల్లింగ్ తీసుకొన్న తర్వాతనే వేయాలని అధికారులను కోరడం జరిగిందన్నారు.అదేవిధంగా 2018 ణూజ ఉపాధ్యాయులకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన ఆదేశాలు అనుసరించి కాకుండా జిల్లాలో వివిధ మండలాల్లో వివిధ విధాలుగా జాయినింగ్ తేదీని వేయడం జరిగింది అని తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి ఆదేశాల ప్రకారం 2018 డీఎస్సీ వారి జాయినింగ్ తేదీ సెప్టెంబర్ 28, 2020 పైన విధుల్లో చేర్చుకోవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని అన్నారు. కానీ ఉమ్మడి జిల్లాలోని ఇతర మండలాల్లో సెప్టెంబర్ 26, 27 గా జాయిన్ తేదీలు వేయడం జరిగింది అని, కానీ రొల్ల, ఆగలి, మడకశిర, గుడిబండ మండలాలలో జాయినింగ్ తేదీని సెప్టెంబర్ 28, 2020 గా వేయడం జరిగింది అన్నారు. దీనివలన ఆ నాలుగు మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నష్టపోవడం జరుగుతుంది అని తెలిపారు. కావున వారికి న్యాయం చేయగలరని కోరారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2008 డీఎస్సీ వారికి కూడా ఇలాంటి జాయినింగ్ తేదీ సమస్యను ఆ జిల్లా డీఈవో దృష్టికి తీసుకువెళ్లగా వారు, ఆ విషయంపై విచారణ జరిపి 2008 డీఎస్సీ లో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు అందరికీ ఒకే జాయిన్ వేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా నాయకులు రామకృష్ణ నాయక్, ఆంజనేయులు, లక్ష్మయ్య, రాంప్రసాద్, మల్లేష్, అమర్నాథ్ రెడ్డి, రామాంజినేయులు, సకల చంద్రశేఖర్, సురేష్, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు