Homeతెలంగాణలాభాల్లో 34 శాతం..సింగరేణి కార్మికులకు బోనస్‌ ప్రకటించిన తెలంగాణ సర్కారు

లాభాల్లో 34 శాతం..సింగరేణి కార్మికులకు బోనస్‌ ప్రకటించిన తెలంగాణ సర్కారు

- Advertisement -

తెలంగాణ సర్కారు సింగరేణి కార్మికులకు బోనస్‌ను ప్రకటించింది. గత సంవత్సరం 33 శాతం వాటాను కార్మికులకు అందించిన విషయం తెలిసిందే.ఈసారి ప్రతి ఉద్యోగికి రూ.1,95,610 బోనస్‌గా ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.మొత్తం రూ.819 కోట్లను సింగరేణి ఉద్యోగులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాణాధారంలాంటిది. ఇది కేవలం బొగ్గు గనుల సంస్థ మాత్రమే కాదు, ఉద్యోగాలకూ పెద్ద ఆధారం. సంస్థను సమర్థంగా నడిపిస్తున్న యాజమాన్యాన్ని అభినందించాలి అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు