విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులో వెలసిన శ్రీ శ్రీ మడివేలి మాచదేవ నూతన ఆలయ నిర్మాణానికి గ్రామ దేవతలు శ్రీ శ్రీ పెద్ద లక్ష్మమ్మ దేవి , చిన్న లక్ష్మమ్మ దేవి ఆలయ పూజారి దంపతులు లలితమ్మ, నరసింహాచారి రజకులకు తమ వంతుగా శుక్రవారం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరసింహాచారి మాట్లాడుతూ శ్రీ శ్రీ మడివేలి మాచదేవ నూతన ఆలయ నిర్మాణానికి ప్రజలు, భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆలయ నిర్మాణంలో పాత్రులు కావాలని కోరారు.