Thursday, January 15, 2026
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాఘనంగా ముగిసిన గ్రంథాలయ 58వ వారోత్సవాలు…

ఘనంగా ముగిసిన గ్రంథాలయ 58వ వారోత్సవాలు…

- Advertisement -

విశాలాంధ్ర నందిగామ:-ప్రగతి పదం వైపు యువత దూసుకెళ్లాలంటే గ్రంథాలయం తమ దినచర్యలను భాగంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు గురువారం నందిగామ శాఖ గ్రంథాలయ 58 వ గ్రంథాలయ వారోత్సవాలు శాఖ అధికారి అల్లూరి రామచంద్రుడు ఆధ్వర్యంలో జరుగుతున్న ముగింపు సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ముందుగా సిరీస్ స్వచ్ఛంద సంస్థ వారు గ్రంధాలయం కు అందించిన కంప్యూటర్ను మరియు టీవీని ఆమె విద్యార్థులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యను అభ్యసించే బాల బాలికలు తమ భవిష్యత్తు ప్రణాళికలో ఈ గ్రంథాలయం ఒక నిఘంటువుల ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని దాని ద్వారా ఉన్నత శిఖరాలు విద్యార్థులు చేరుకోవటానికి దోహదపడుతుందని అన్నారు పుస్తక పఠనం బాల సాహిత్యం ప్రముఖుల వ్యక్తుల జీవిత చరిత్రలు చదివి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను చూసి మానసిక ఉల్లాసం కొరకు లైబ్రరీని సంక్రమంగా వినియోగించుకోవాలని ఆమె కోరారు గత వారం రోజులుగా జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భారంగా వివిధ కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను మరియు సర్టిఫికెట్స్ ను ఆమె అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ అధ్యక్షులు బండారు హనుమంతరావు, ఆత్మీయ అతిథులు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, నందిగామ మండలం తెదేపా అధ్యక్షులు వీరంకి వీరస్వామిన్, ఏఎంసి వైస్ చైర్మన్ అమ్మినేని జ్వాల ప్రసాద్, రిటైర్డ్ విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులు పాఠకులు విరివిగా పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు