Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశరీరం అనేది ఒక దేవాలయం లాంటిది..

శరీరం అనేది ఒక దేవాలయం లాంటిది..

- Advertisement -

వైద్యాధికారులు దిలీప్ కుమార్, పుష్పలత

విశాలాంధ్ర ధర్మవరం;; మానవ శరీరం అనేది ఒక దేవాలయం లాంటిది అని, దానిని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం అందరి కనీస బాధ్యత అని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ దిలీప్, డాక్టర్ పుష్పలత తెలిపారు. ఈ సందర్భంగా దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవము సందర్భంగా గ్రామంలో ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. కావున ప్రతిరోజు ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిశుభ్రమైన ఆహారం తీసుకుంటూ, పరిశుభ్రమైన నీరును తీసుకొని, తగిన పోషక ఆహారం తీసుకొని,రోజుకు కనీసం 30 నిమిషాలు చొప్పున వ్యాయామం, యోగా కార్యక్రమాలలో పాల్గొనవలెనని తెలిపారు. అలాగే ఏప్రిల్ మే నెలలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున గర్భిణీ స్త్రీలు, వృద్ధులు బయటకు ఉదయం గాని సాయంత్రం గాని మాత్రమే రావాలని మిగిలిన సమయాన్ని పనులను చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ రాజశేఖర్ రెడ్డి , హెల్త్ అసిస్టెంట్ లు ఆంజనేయులు ,రాజశేఖర్ , ఏఎన్ఎంలు, ఎం.ఎల్.హెచ్.పిలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు