Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఫ్లెక్సీల నిర్వహణపై సమావేశం.. మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య

ఫ్లెక్సీల నిర్వహణపై సమావేశం.. మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో ఫ్లెక్సీల నిర్వహణపై పట్టణంలోని రాజకీయ నాయకులకు, ఫ్లెక్సీ నిర్వాహకులకు, మేదర సంఘ నాయకులతో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటరమణయ్య మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, సీనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ధర్మవరం ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. పట్టణంలో ఎక్కడైనా సరే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవాలంటే మున్సిపల్ కార్యాలయం ద్వారా అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన తర్వాత నిర్ణీత సమయం ముగిసిన వెంటనే మీరే స్వతహాగా ఫ్లెక్సీలను తొలగించుకోవాలని తెలిపారు. రోడ్డు డివైడర్ల మధ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వలన వాహనదారులకు ఇబ్బందులు కలగడంతో పాటు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం పట్టణమునందు అనధికారికముగా కట్టిన ఫ్లెక్సీలను వెంటనే మీరే స్వతహాగా తొలగించుకోవలసినదిగా వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు