Saturday, December 28, 2024
Homeఆంధ్రప్రదేశ్ప్రజలపై విద్యుత్ చార్జీల బాదుడును విరమించుకోవాలి

ప్రజలపై విద్యుత్ చార్జీల బాదుడును విరమించుకోవాలి

-మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

విశాలాంధ్ర-రాప్తాడు : గృహ వినియోగదారులపై కూటమి ప్రభుత్వం మోపిన రూ.15,485.36 కోట్ల చార్జీల బాదుడును తక్షణమే విరమించుకోవాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ విద్యుత్తు పోరుబాట కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శుక్రవారం రాప్తాడులోని వైఎస్సార్ విగ్రహానికి వైసీపీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసిన అనంతరం గ్రామంలో ర్యాలీ చేశారు. తర్వాత విద్యుత్ ఏఈఈ శివప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలను చంద్రబాబు మర్చిపోయారని, విద్యుత్ ఛార్జీలపై పవన్ కల్యాణ్ మౌనం ఎందుకో చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు తిరగకుండానే విద్యుత్ చార్జీల భారాన్ని మోపడం సరికాదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యత్ కొసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు