Saturday, January 18, 2025
Homeఆంధ్రప్రదేశ్మలేరియా నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత

మలేరియా నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత

జిల్లా అధికారి ఓబులు

విశాలాంధ్ర-రాప్తాడు : మలేరియా నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా మలేరియా అధికారి ఓబులు సూచించారు. మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ దోమల పెరుగుదలను అరికట్టడానికి వాటి వల్ల వచ్చే జబ్బులు, నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. నీటి వనరులపై మూతలు ఉంచుకోవాలని, ఇంటి పరిసరాలలో పనికిరాని ఎలాంటి వస్తువులను పడవేయరాదన్నారు. అంతకుముందు రాప్తాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యాధికారి డాక్టర్ శివకృష్ణతో జాతీయ కీటక జనిత వ్యాధుల నిర్మూలన కార్యక్రమాన్ని గురించి చర్చించారు. మండలంలో నమోదైన మలేరియా డెంగు వ్యాధుల గురించి,తీసుకున్న నివారణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్ ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. మలేరియా రక్తపూతల సేకరణ యాక్టివ్, ప్యాసివ్ సేకరణ, పి.హెచ్.సి కి వచ్చే కొత్త రోగులలో 15% ఉండాలని ల్యాబ్ టెక్నీషియన్ శ్రీధర్ బాబుకు సూచించారు. ఎంఎఫ్ 8, ఇతర రికార్డులను చక్కగా నిర్వహించాలన్నారు. సూచించారు. కార్యక్రమంలో అనంతపురం మలేరియా సబ్ యూనిట్ అధికారి మద్దయ్య, సూపర్వైజర్లు నూర్ బాషా, శ్రీధర్ మూర్తి, రాప్తాడు పీహెచ్సీ సూపర్వైజర్ నరసింహులు, హెల్త్ అసిస్టెంట్ నారాయణస్వామి, ఏఎన్ఎం సునీత, ఆశా కార్యకర్త ఇందిరా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు