Homeఆంధ్రప్రదేశ్ఆ అభ్యర్థి ఆస్తి విలువ రూ. 5863 కోట్లు

ఆ అభ్యర్థి ఆస్తి విలువ రూ. 5863 కోట్లు

- Advertisement -

తమిళనాడు ఎన్నికల్లో అత్యంత ధనిక అభ్యర్థి
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలు ఎవరో తేలిపోయింది. తిరుచిరాపల్లి జిల్లా లాల్‌గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరఫున పోటీ చేస్తున్న లీమా రోజ్ తన కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.5,863 కోట్లుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు ఆమె తన నామినేషన్ అఫిడవిట్‌లో వివరాలు పొందుపరిచారు. అఫిడవిట్ ప్రకారం లీమా రోజ్ పేరిట రూ.139 కోట్ల చరాస్తులు, రూ.910 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త అయిన మార్టిన్ పేరిట అత్యధికంగా ఆస్తులు ఉన్నాయి. ఆయనకు రూ.3,262 కోట్ల చరాస్తులు, రూ.887 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరి కుమారుడు జోస్ టైసన్ మార్టిన్ పేరిట కూడా రూ.225 కోట్ల చరాస్తులు, రూ.439 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు