Homeజిల్లాలుఅనంతపురంచేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

- Advertisement -

చేనేత కుటుంబాలకు రూ 36 వేలు అందజేయాలి….

నేతన్నలు మెడకు ఉరి తాళ్లతో నిరసన

విశాలాంధ్ర -అనంతపురం : చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, చేనేత కుటుంబాలకు తక్షణమే రూ 36 వేలు అందజేయాలని ఏపీ చేనేత సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్. శ్రీరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి గోవిందు ఆధ్వర్యంలో గురువారం స్థానిక కృష్ణకళామందిర్ నుంచి జిల్లాలోని నేత కార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ అందులో భాగంగా వినూత్న రీతిలో నేతన్నలు మెడకు ఉరి తాళ్లతో నేత బజార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ చేనేత సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ… జాతీయ చేనేత దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంటుంటే అనంత ఉమ్మడి జిల్లా చేనేత కార్మికులు తమ సమస్యల కోసం మెడలో ఉరితాడు వేసుకొని నిరసన తెలపడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చేనేత కుటుంబాలకు సంవత్సరానికి రూ. 36 వేలు అందిస్తామని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పైగా కావస్తున్న ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. చేనేత బడ్జెట్లో 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎక్కడ కేటాయించారని ప్రశ్నించారు. చేనేత కార్మికుడు ఆత్మహత్య పాల్పడిన ఆ కుటుంబానికి రూ. 7 లక్షలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ కుటుంబాలకు ఒక లక్ష కూడా ఇవ్వలేదన్నారు. వెనుకబడిన జిల్లాలో సొసైటీలు ఏర్పాటు చేస్తామని తద్వారా సొసైటీ ద్వారా రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటివరకు 19 సొసైటీలు ఏర్పాటు చేసినప్పటికీ ఏ ఒక్క సొసైటీ కూడా నగదు మంజూరు చేయలేదన్నారు. చేనేత వస్త్రాలపై జిఎస్టి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో పవర్లూమ్స్ లకు రాజకీయ నాయకులు వత్తాసు పలుకుతున్నారు అన్నారు. చేనేత కార్మికులకు గిట్టుబాటు ధరలు లేక పక్క రాష్ట్రాల్లో వలసలు పోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. చేనేత నేసిన చీరలను ప్రభుత్వమే కొనుగోలు చేసి చేనేత కుటుంబాల ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తామన్నారు. చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు లింగమయ్య మాట్లాడుతూ… జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాల్లో చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నారు. చేతివృత్తిదారులందరికీ బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదన్నారు. గత ఆరు నెలల్లో ఆన్లైన్లో చేతివృత్తిదారులు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేతివృత్తిదారుల సమాఖ్య పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత సంఘం జిల్లా నాయకులు జి పురుషోత్తం, చింతా వెంకటరమణ, చింతా పురుషోత్తం, పి. శేఖర్, ఎర్రి స్వామి, పూజారి లక్ష్మీనారాయణ, రామాంజి, రామాంజనేయులు వందలాదిమంది చేనేత కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు