Homeజిల్లాలుఅనంతపురంనగరంలో హర్ ఘర్ తిరంగ ర్యాలీ

నగరంలో హర్ ఘర్ తిరంగ ర్యాలీ

- Advertisement -

విశాలాంధ్ర -అనంతపురం : అజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగ ర్యాలీని నగరంలోని డిఆర్డిఏ కార్యాలయం నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు నిర్వహించారు. గురువారం జిల్లా పర్యాటక అధికారి మరియు నోడల్ అధికారి జయకుమార్ బాబు, మెప్మా పిడి విశ్వజ్యోతి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పర్యాటక అధికారి, మెప్మా పిడి మాట్లాడుతూ అజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలతో తిరంగ ర్యాలీలు నిర్వహించామన్నారు. జిల్లా అంతటా స్వయం సహాయక సంఘాలు తిరంగ మేళాను నిర్వహించడం జరిగిందన్నారు. తిరంగ రంగు థీమ్ వస్తువుల అమ్మకం, సెల్ఫీ బూత్‌ల ఏర్పాటు చేశామన్నారు. అనంతరం జిల్లా పర్యాటక అధికారి, డిఆర్డీఏ పిడి శైలజ, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నగరంలోని జేఎన్టీయూ రోడ్ లో మహిళా సమాఖ్య కార్యాలయం నుంచి జేఎన్టీయూ ఆడిటోరియం వరకు తిరంగ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, మహిళా సమాఖ్య సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు