విశాలాంధ్ర తాడిపత్రి : ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం క్రింద 32, 33, 34 వార్డుల లబ్ధిదారులకు గృహమంజూరు పత్రాలను మంగళవారం ఎమ్మెల్యే జె.సి. అస్మిత్ రెడ్డి అందజేశారు. నందలపాడు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ప్రగతి పాఠశాలలో హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే, అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని, రాబోవు రోజుల్లో పేద ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తలారి అరుణ, కౌన్సిలర్లు విజయ్ కుమార్, మంగపట్నం లక్ష్మీదేవి, కోట సుశీలమ్మ, బోసి అంజనమ్మ, బోసి రామచంద్ర, మున్సిపల్ కమిషనర్ శివ రామకృష్ణ, హౌసింగ్ AE రాజశేఖర్ రెడ్డితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.


