Sunday, December 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా జరిగిన కవి సమ్మేళన కార్యక్రమం..

ఘనంగా జరిగిన కవి సమ్మేళన కార్యక్రమం..

- Advertisement -

గ్రంధాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల పౌర శాఖ ప్రధాన గ్రంథాలయంలో నాలుగవ రోజు 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కవి సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కవి ప్రఫుల్ల చంద్ర, టీటీడీ ధర్మాచార్యులు వెంకటేశులు, కాకుమాని రవీంద్ర గాయకులు నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన కవులు గ్రంథాలయం గురించి ఒక పద్యాన్ని కవిత ద్వారా విద్యార్థులకు వినిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అనంతరం పాటలు గేయాలు,, పద్యాలు, కవితలు, విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది రాము, రమణా నాయక్, గంగాధర్, సరస్వతమ్మ, పాఠకులు,55 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు