మండల విద్యాశాఖ అధికారి గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న సర్వ శిక్ష అభియాన్ కార్యక్రమం కింద ఉపాధ్యాయులందరికీ టీచ్ టు ట్రైనింగ్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏపీ ఎంఈఓ గోపాల్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులకు ఏ విధంగా అయితే మన మూల్యాంకనం చేస్తామో ,అదేవిధంగా టీచ్ టూల్ అనేది ఉపాధ్యాయుల బోధన విద్యార్థులకు సక్రమంగా అందుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం టీచ్ టూల్ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుందని తెలిపారు. వీటిని ఉపాధ్యాయులు అందరూ కూడా పాఠశాల తరగతి గదిలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులందరూ బోధనా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకొనుటకు టీచ్ టూల్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాంప్రసాద్, జీవి జడ్పీఎస్ ప్రధానోపాధ్యాయులు సుమన, జగదీష్, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, సీఎంఆర్టీలు పాల్గొన్నారు.
టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరం..
- Advertisement -
RELATED ARTICLES


