Sunday, December 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిత్వరలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం..

త్వరలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం..

- Advertisement -

బలిజ సంక్షేమ సంఘం, బలిజ మహిళా మండలి, బలిజ యూత్
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని లోని కోటలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని త్వరలో ప్రతిష్టించనున్నామని బలిజ సంక్షేమ సంఘం, బలిజ మహిళా మండలి, బలిజ యూత్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు లోని కోటలో “జయహో శ్రీకృష్ణదేవరాయ” కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం బలిజ సంగం నాయకులు తొండ మాల బాబు మాట్లాడుతూ అప్పటి శ్రీకృష్ణదేవరాయలు ధర్మవరం పట్టణంలో కోట నిర్మించడం జరిగిందని, కాలక్రమమైన ఆ వీధికి లోనికోటగా నామకరణం చేయడం జరిగిందన్నారు. ఆ మహానుభావుని చిరకాలం గుర్తిండిపోయేలా లోని కోట వీధిలోనే వారి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తెలిపారు. అంతేకాకుండా శ్రీ సత్య సాయి జిల్లాలో గల అన్ని మండలాలలో రాయలవారు పాలించిన వాటిలో కోటలు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటిని పురావస్తు శాఖ అధికారులు గుర్తించి, ప్రభుత్వ అనుమతితో మరమ్మత్తులు చేయించి, పర్యాటక కేంద్రంగా మార్చాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బేల్దారి చేన్న రాయుడు, అల్లం మూర్తి ,తోట ప్రసాద్, పెరిమాలి రమాదేవి, ముక్తం కాశి, గోపి రాయల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు