- Advertisement -
విశాలాంద్ర ధర్మవరం:: పట్టణంలోని సాయి నగర్లో గల సూర్య ఉన్నత పాఠశాల విద్యార్థిని టీఎం. యామిని రాకింగ్ స్టార్స్ డాన్స్ ధర్మవరం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఇంటర్నేషనల్ డ్యాన్స్ 2025 పోటీల్లో ప్రతిభ ఘనపరిచి ప్రశంసా పత్రం పొందడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ నరేంద్రబాబు, డాన్స్ మాస్టర్ లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా కర్రీస్పాండెంట్, డాన్స్ మాస్టర్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు టీఎం యామినీకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. మా పాఠశాలలో చదువుతోపాటు క్రీడలు, నృత్యం పై కూడా చక్కటి అవగాహనతో పాటు ప్రాక్టీసులు కూడా చేయబడునని తెలిపారు.


