-జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ జయలక్ష్మి
విశాలాంధ్ర-రాప్తాడు : కుష్టు వ్యాధిబారిన పడకుండా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా డి ఎం హెచ్ ఓ జిల్లా కుష్టువ్యాధి అధికారి డాక్టర్ జయలక్ష్మి సూచించారు. కుష్టువ్యాధిపై అవగాహన కల్పిస్తూ ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మంగళవారం రాప్తాడులో పరిశీలించారు. ప్రతి ఆశా కార్యకర్త రోజు కు 20 ఇళ్ల వరకు కుష్టు వ్యాధి సర్వే చేయాలన్నారు. ఇంటి వద్దకు వెళ్లినపుడు ఇంట్లో వారందరికీ స్పర్శ లేని రాగి రంగు మచ్చ లు ఉన్నాయా, కాళ్ళు చేతులు కండరాలతో బలహీనత, కాళ్ళ నుండి చెప్పులు జారిపోవడం, చెవి తమ్మెలు మందంగా మారిపోవడం, కళ్ళు పూర్తిగా మూసుకోలేక పోవడం వంటి ప్రశ్నలు అడిగారు. అనుమానంగా ఉన్న కేసులను పి.హెచ్.సి డాక్టర్ శివకృష్ణ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సిఫారసు చేయాలన్నారు. డాక్టర్ జయలక్ష్మి, పీఎంఓ నాగన్న మొదట పి.హెచ్.సి కి వచ్చి డా.శివకృష్ణతో కుష్టువ్యాధి గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డీపీఎంఓ రామదాసు, సీహెచ్ఓ శివప్రసాద్, సూపర్వైజర్ అరుణ, ఎంపీహెచ్ఏ నారాయణ స్వామి, ఏఎన్ఎం ఝాన్సీ, ఆశా కార్యకర్తలు గాయత్రి, చంద్రకళ పాల్గొన్నారు.


