ఘనంగా సత్యసాయి రథోత్సవం.
రథోత్సవంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు…

విశాలాంధ్ర పుట్టపర్తి:- శ్రీ భగవాన్ సత్యసాయిబాబా రథోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం వేద పండితుల వేదమంత్రోచ్ఛానులతో రథోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.సత్యమ్మ దేవాలయం నుంచి ప్రారంభమై ఉత్తర గోపురం వరకు రథాన్ని లాగారు. విశేష ఆకర్షణగా కోలాటాలు, కళా జాతర బృందాలు,కీలుగుర్రాలు , డబ్బు వాయిద్యాలు , మంగళ వాయిద్యాలు, గరగర నృత్యం, పిల్లల వేషధారణ, భక్తులను అబ్బురపరిచాయి. సాయి నామస్మరణలతో పురవీధులు పులకరించాయి.రథోత్సవ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ దంపతులు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్,సవిత, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి,ఎమ్మెల్యేలు పల్లె సింధూర, పరిటాల సునీత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ,మాజీ ఎంపీ మురళీ మోహన్ , కేంద్ర నెహ్రూ యువకేంద్రం మాజీ కో ఆర్డినేటర్ సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ,ఎస్పీ సతీష్ కుమార్,సత్యసాయి ట్రస్ట్ సభ్యులు రథాన్ని ముందు కులాలు భక్తిని చాటుకున్నారు.రథోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి పుట్టపర్తి పురవీధులలో సాయి భక్తులు బారులు తీరారు.స్వదేశీ విదేశీ భక్తులతో పుట్టపర్తి కిట కిట లాడింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబులపతి, సామకోటి ఆదినారాయణ, డిఎస్పి విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు


