ఏప్రిల్ 1 నుంచి 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం
భూ ఉపరితలం వేడెక్కడమే ఈ వర్షాలకు కారణమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
తెలంగాణ వాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించేలా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భూ ఉపరితలం వేడెక్కడంతోనే ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 2, 3 తేదీల్లో వానల కారణంగా వాతావరణం చల్లబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కుమురం భీమ్, వనపర్తి, నిర్మల్, జోగులాంబ గద్వాల్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలంగాణకు వర్ష సూచన
RELATED ARTICLES