పరిటాల శ్రీరామ్ చొరవతో వరి నాట్లు ప్రారంభించిన రైతులు
దాదాపు వెయ్యి ఎకరాల పైబడి చెరువు క్రింద భాగంలో వరి సాగుకు సిద్ధమైన రైతులులి
విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ చొరవతో ధర్మవరం చెరువు ఆయకట్టు కింద ఉన్న రైతులు వరి నాట్లు ప్రారంభించారు.గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా ధర్మవరం చెరువులో నిండుకుండలా నీరు ఉన్న వరిసాగు చేయలేక ఇబ్బంది పడిన రైతులు పరిటాల శ్రీరామ్ చొరవతో ధర్మవరం చెరువు ఆయకట్టు కింద ఉన్నటువంటి ప్రధాన కాలువలను దాదాపు 30 రోజులు పాటు జెసిబిలతో పూడికతీత పనులు మొత్తం పూర్తిచేసి, ప్రధాన కాలువలు గుండా చెరువు నీరు ప్రవహించే విధంగా రైతులకు దోహదపడ్డారు.ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ రైతులపై చూపించిన చొరవకు ధర్మవరం చెరువు ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులందరూ హర్షం వ్యక్తం చేశారు.గత 40 ఏళ్లుగా ధర్మవరం చెరువు ఆయకట్టు కింద ప్రధాన కాలువ పూడికతీత పనులు ఏ ఒక్కరు పట్టించుకోకపోయినా పరిటాల శ్రీరామ్ తన అనుచర గణంతో ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువు ఆయకట్టు కింద రైతులు ఈసారి వరి నాట్లు నాటి తీరాలని కృతనిశ్చయంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.