Friday, April 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, ధరలను వెంటనే తగ్గించాలి

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, ధరలను వెంటనే తగ్గించాలి

సిపిఎం పార్టీ నాయకులు నిరసన
విశాలాంధ్ర ధర్మవరం : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ,పెట్రోలు, డీజిల్, ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో స్థానిక కళాజ్యోతి సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు ఎస్ హెచ్ భాష, ఏ.మారుతి,సిఐటియు నాయకులు జె వి రమణ, టి.అయుబ్ ఖాన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, గ్యాస్ సిలిండర్ల పైన పెంచిన 50 రూపాయలు. (గోరుచుట్టుమీద రోకలిపోటు) అన్నట్లు. బడుగు బలహీన వర్గ ప్రజలు. పేదలు. మోయలేని విధంగా భారాన్ని పెంచారని మండిపడ్డారు.అదేవిధంగా నిత్యవసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని, డీజిల్. పెట్రోల్ .ధరలు పెంచుతున్నారని, విద్యుత్ బిల్లులను విపరీతంగా పెంచుతున్నారని, ఒకవైపు పేద బడుగు బలహీన వర్గ ప్రజలు ఉపాధి పనులు లేక వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల జీవన పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని, కార్మికులకు. పేదలకు. పనులు లేక ఇబ్బందులు పడుతుంటె వారిని మరింత ఇబ్బందులకు గురి చేసే విధంగా డీజిల్. పెట్రోల్. గ్యాస్ ధరలను, నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రజలపై మరింత భారాలను మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కావున ఇప్పటికైనా పెంచిన గ్యాస్ ధరలను, డీజిల్. పెట్రోల్. ధరలను, విద్యుత్ ధరలను తగ్గించాలని ,ఆ విధంగా కాని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజలను.
రైతులను. కార్మికులను కలుపుకొని. పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికిహెచ్చరించారు.ఈ కార్యక్రమంలో
సిఐటియు నాయకులు ఎల్.ఆదినారాయణ, ఎస్. హైదర్ వలీ, చేనేత కార్మిక సంఘం నాయకులు, గుంపు హరి, వి.వెంకటస్వామి, ఏ. ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు