విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలం లోని శ్యామీరపాలెం మరియు కొండసముద్రం రైతు సేవ కేంద్ర పరిధిలో మండల వ్యవసాయ అధికారి కె.వి. శేషారెడ్డి ఆధ్వర్యంలో పొలంపిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులందరికీ ఖరీఫ్ లో పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతులందరూ తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ తో (ఎన్ పీ సీ ఇ) మ్యాప్ చేపించుకోవాలని అన్నారు , మండలం లో 144 మంది రైతులకు మ్యాప్ కాలేధని, తమ రైతు సేవా కేంద్రాలలో సంప్రదించాలని తెలియచేశారు. రైతులందరూ తమ పంటలను ఈ క్రాప్ తప్పని సరిగా చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుసేవా కేంద్ర సిబ్బంది సురేష్, రవి మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.


