చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
విశాలాంధ్ర గూడూరు: రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సకాలంలో అందించే విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్, డైరెక్టర్లు సేవలు అందించాలని తెలిపారు. మంగళవారం గూడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి కార్యాలయంలో నిర్వహించిన వ్యవసాయ సహకార సంఘం త్రి సభ్య కమిటీ చైర్మన్ బి దానమన్న, డైరెక్టర్ రేమట వెంకటేష్ , అల్లుపీరల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, గూడూరు పట్టణ కన్వీనర్ కే రామాంజనేయులు, మండల కన్వీనర్ జె సురేష్ ముఖ్య అతిథులుగా హాజరై నూతనంగా ప్రమాణ స్వీకారం చేపట్టిన త్రీ సభ్య కమిటీ సభ్యులకు పూలమాలతో సత్కరించి శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాథమిక సహకార సంఘాల బలోపేతానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. రైతులకు రుణాలు అందించడంలో అధికారులను సమన్వయం చేసుకొని చైర్మన్, డైరెక్టర్లు సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు బొజగు సృజన్, టిడిపి కౌన్సిలర్ బుడ్డంగిల్, షాషావలి, టిడిపి నేతలు పౌలు, సాగునీటి సంఘం అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, ఈసాకు, తదితరులు ఉన్నారు.
రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సకాలంలో అందాలి
- Advertisement -


