బీసీ మహిళా విభాగ అధ్యక్షురాలు సంకారపు జయ శ్రీ
విశాలాంధ్ర ధర్మవరం;; బీసీ మహిళలకు సబ్కోటానిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసి అమలు జరపాలని మహిళ విభాగ అధ్యక్షురాలు శంకరపు జయ శ్రీ, గౌరవ అధ్యక్షురాలు వాయిదాల సరళ దేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు విజయవాడ ధర్నా చౌక్ లో నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు మార్గ నిర్దేశంలో రాష్ట్ర వ్యాప్త మహిళలందరూ జయశ్రీ నాయకత్వంలో నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులతో పాటు శంకరపు జయ శ్రీ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా కేంద్రంలో పలు ప్రభుత్వాలు మారిన చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింపబడా లేకపోవడం దారుణమని తెలిపారు. చట్టసభలలో 33 శాతంతో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం ఆమోదించడం హార్షనీయమని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఓబీసీ మహిళలకు ఉపకోట కావాలని గల్లీ నుండి ఢిల్లీ వరకు దేశంలోని అన్ని ఓబీసీ సంఘాలు ఉద్యమించినప్పటికీ ఈనాటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించకుండానే మంది బలముతో చట్టం చేసేసుకుందని తెలిపారు. కానీ దాని అమలు మాత్రం జన గణన పూర్తి దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరుగుతుందని కొరివి పెట్టడం సరి అయిన పద్ధతి కాదని తెలిపారు. సామాజిక అనిచివేతకు ఆర్థిక దోపిడీకి గురై అన్ని రంగాలలో అన్ని విధాలుగా వెనుకబడి ఉందని తెలిపారు. కనీసం వర్షాకాల పార్లమెంటు సమావేశంలోనే చట్టసభలలో ఓబీసీల రిజర్వేషన్ల తో పాటు మహిళా రిజర్వేషన్ల చట్టానికి ఓబిసి మహిళలకు సబ్ కొట్టాలిస్తూ సవరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. 2029 ఎన్నికల నాటికి కుల గణనతో పాటు నియోజకవర్గాల పునర్విభజనను పూర్తి చేసి అమలు జరిపాలని తెలిపారు. ఈ దీక్షా కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు పాల్గొని నిరాహారదీక్ష చేస్తున్న మహిళలకు వారు మద్దతు, సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు క్రాంతి కుమార్, బీసీ మహిళా సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించాలి..
- Advertisement -
RELATED ARTICLES


