Homeఆంధ్రప్రదేశ్ఘనంగా సిపిఐ జిల్లా మహాసభలు

ఘనంగా సిపిఐ జిల్లా మహాసభలు

- Advertisement -

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తిరుపతి జిల్లా ద్వితీయ మహాసభలు సూళ్లూరుపేటలో ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. రెండవ రోజు సోమవారం ఉదయం ప్రతినిధుల మహాసభ సత్య సాయి కళ్యాణ మండపంలో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. మహాసభల ప్రారంభ సూచికగా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పార్థసారథి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రతినిధుల మహాసభను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ ప్రారంభించారు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీ హరినాథ్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఓట్లు సీట్లు లేవు అని నిరుత్సాహపడకుండా పార్టీ ఘనమైన చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని కార్యకర్తలు ప్రజల సమస్యల పరిష్కారంలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నేడు బిజెపి అవలంబిస్తున్న విధానాలను తిప్పి కొట్టేందుకు కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాత్మకంగా బలోపేతం కావాలి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాల పై ప్రతి కార్యకర్త అవగాహన చేసుకుని ప్రతి పౌరుడికి పథకాలు అందే విధంగా కమ్యూనిస్టు కార్యకర్త ముందు వుండి పోరాడాలని కోరారు. కమ్యూనిస్టులు చట్ట సభల్లో ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లో పోటీ చేసి గెలిచేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలి అని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు మాట్లాడుతూ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో శాఖ నుండి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. నేడు రాష్ట్రంలో దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలు ఎప్పటికప్పుడు రాజకీయ చైతన్యంతో కూడిన పోరాటాలకు సిద్ధపడాలని సూచించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జయలక్ష్మి మాట్లాడుతూ ఎర్రజెండా నీడన చేరిన కార్యకర్తలు పరిపక్వ రాజకీయ నాయకులుగా తయారు అవుతున్నారని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ సామాన్యుడికి పౌష్టిక ఆహారం అందడం లేదన్నారు. మహిళల పై నిత్యం అత్యాచారాలు జరుగుతునన్నా పాలకులు పట్టించుకోవడం లేదు అన్నారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు