Homeఆంధ్రప్రదేశ్వర్గ పోరాటాల ఘన చరిత్ర సిపిఐ ది

వర్గ పోరాటాల ఘన చరిత్ర సిపిఐ ది

- Advertisement -

వందేళ్ళ ఎర్రజెండా భవిష్యత్తు తరాలకు దిక్సూచి

మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్

ప్రజా చైతన్యంలో కీలక భూమిక కమ్యూనిస్టులదే

పి హరినాథ్ రెడ్డి

భారత కమ్యూనిస్టు పార్టీ వర్గ పోరాటాల ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అన్నారు. సిపిఐ తిరుపతి జిల్లా ప్రతినిధుల మహాసభలు సోమవారం సూళ్లూరుపేట సత్య సాయి కళ్యాణ మండపంలో చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, బండి చలపతి, నదియా అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన జల్లి విల్సన్ మాట్లాడుతూ, స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ ముష్కరులకు వ్యతిరేకంగా పోరాడడం జరిగిందని, స్వాతంత్రానంతరం కార్మిక కర్షకుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు అవుతోందని అన్నారు. ఆర్ఎస్ఎస్ ఆదేశాలతో మోడీ దేశాన్ని పాలిస్తున్నాడు. ఓకే దేశం, ఒకే భాష, ఒకే మతం అనే నినాదం తో మత కలహాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. అటవీ భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి గిరిజనుల కడుపు లు కొడుతున్నారని పేర్కొన్నారు. రామజన్మ భూమిని న్యాయవ్యవస్థను ప్రబావితం చేసి హిందువులకు అనుకూలంగా తీర్పు ఇప్పించారు..అనంతరం అదే జడ్జికి రాజ్యసభ పదవి కట్టబెట్టడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. హిందువులకు అనుకూలంగా ఆర్ ఎస్ ఎస్ లాంటి సంస్థలు పని చేస్తుంటే పవన్ కల్యాణ్ లాంటి వారు సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకోవడం శోచనీయం అన్నారు. రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే దేశవ్యాప్తంగా మహోద్యమం వచ్చి తిప్పికొట్టడం జరిగింది అన్నారు. ట్రంప్ కు మోడి భయపడి ఆయన చెప్పిన పనులు చేస్తున్నారని విమర్శించారు. భారత్ పాక్ మధ్య ఎప్పుడు ఘర్షణ వచ్చినా స్వతంత్ర నిర్ణయాలు ఉండేవి అని మోడీ వచ్చాక అమెరికా జోక్యం పెరిగింది అన్నారు. దేశంలో అన్ని రంగాలు అస్తవ్యస్థంగా వున్నాయాన్నారు. రాష్ట్రం లో జగన్ స్వయం కృతాపరాధంతో ఇంటికి వెళ్లారు.కూటమి ప్రభుత్వం వస్తె అభివృద్ధి పరుగులు పెట్టిస్తా అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చేయలేనని అని తప్పించుకుంటున్నారు. ఒకప్పుడు వృద్ధులకు, వికలాంగులకు పెంక్షన్ ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తే విమర్శించారని పేర్కొన్నారు. నేడు స్మార్ట్ మీటర్ల పేరుతో సామాన్య, మధ్య తరగతి ప్రజల పై పెను భారం మోపుతున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం లో స్మార్ట్ మీటర్ల ను బిగిస్తే పగుల కొట్టాలి అని చెప్పిన నారా లోకేష్ నేడు బిగించండి అని చెప్పడం శోచనీయం అన్నారు. అమరావతి అభివృద్ధి పేరుతో లక్ష ఎకరాల భూమి సేకరించాలి అని చంద్ర బాబు టార్గెట్ గా పెట్టుకున్నారని తెలిపారు. దేశంలో, రాష్ట్రం లో అధికారం లో ఉన్న కూటమి ప్రభుత్వాల పై భవిష్యత్ లో వామపక్ష, లౌకిక పార్టీ లను కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటాన్ని సాగించాలని పిలుపునిచ్చారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ను చైతన్యం చేయడం లో కీలక భూమిక కమ్యూనిస్టులదే అని స్పష్టం చేశారు. వంద సంవత్సరాల లో దేశం లో కమ్యూనిస్టు లు అధికారం లోకి రాకపోయినా ప్రజలపక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు సాగించిందన్నారు . దేశంలో ఆకలి, అణచి వేత, దోపిడి ఉన్నంత వరకు కమ్యూనిస్టు పార్టీ వుంటుందన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతం సజీవమైందని ఆ విషయం వర్గ శత్రువులకు తెలుస న్నారు. బ్యాంకుల జాతీయకరుణ కోసం పోరాడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు. దీంతో బ్యాంకింగ్ వ్యవస్త బలపడటం తో పాటు సామాన్యుడి ఆర్థిక స్థితి మెరుగు పడిందని ఆయన పేర్కొన్నారు. దళితులకు భూములు ఉండాలని భూ పోరాటాలను చేసింది కమ్యూనిస్టు పార్టీ నే అని పేర్కొన్నారు. బిజెపి దేశం లో అభివృద్ధి చేయక పోయిన ప్రజల దృష్టి మరల్చే పనులు చేస్తోంది అన్నారు. దేశ భద్రత కే ప్రమాదం ఏర్పడింది అనడానికి పెహాల్ గామ్ దాడి ఘటనే ఉదాహరణ అన్నారు. ట్రంప్ నేను చెబితే యుద్ధం ఆగిపోయింది అంటున్నాడు, మోడీ అమెరికా సామ్రాజ్య విధానాలకు దాసోహం అయిపోయింది అన్నారు. అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్రంప్ మన దేశాన్ని శాశించడం ఏమిటి అని ప్రశ్నించారు. టిటిడి లో అన్యమతస్థులు ఉన్నారని చెబుతున్న బిజెపి నేతలు ముస్లిం కమిటీ లో హిందువులు ఎందుకు ఉన్నారో సమాధానం చెప్పాలన్నారు. జగన్ ప్రభుత్వానికి కొనసాగింపు గా కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది తప్ప కొత్తగా చేసింది ఏమి లేదు అన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి బాబు ఎందుకు గొడవ చేయడం లేదు అని ప్రశ్నించారు. ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయక పోగా బనకచర్ల ప్రాజెక్టు తెరమీదకు తీసుకొచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన సంవత్సరం లోనే అవినీతి విపరీతంగా పెరిగింది అని దీనిపై పోరాటాలకు సిద్ధం కావాలి అని పిలునిచ్చారు. పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడం తో పాటు రాజకీయ చైతన్యం పెంచుకోవాలని కోరారు. మహాసభ ల ప్రారంభ సూచికగా సిపిఐ సీనియర్ నాయకులు పార్థసారథి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి నాయకులు కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం స్టీరింగ్ కమిటీ గా వ్యవహరించింది. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, శివారెడ్డి జయలక్ష్మి మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పాల్గొని ప్రసంగించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు