Homeఆంధ్రప్రదేశ్గ్రామ సమస్యల పరిష్కారమే మా ధ్యేయం..

గ్రామ సమస్యల పరిష్కారమే మా ధ్యేయం..

- Advertisement -

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: గ్రామాల సమస్యలను పరిష్కారవంతుగా పరిష్కరించడమే మా ధ్యాయమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామంలో గ్రామస్తులతో కలిసి పర్యటించారు. అక్కడ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, సమస్యలపై వారు ఆరా తీశారు. ఈ గ్రామంలో సిసి రోడ్ల కొరత మౌలిక సదుపాయాలపై గ్రామస్తుల యొక్క విన్నపాలను వారు స్వయంగా స్వీకరించారు. తప్పకుండా ఈ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా పరిష్కరించే దిశగా తాను చర్యలు వెంటనే చేపడుతానని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మాజీ జడ్పీ అధ్యక్షులను పరామర్శ;;; మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామానికి చెందిన మాజీ జడ్పీ అధ్యక్షులు చిగిచెర్ల ఓపిరెడ్డి ఇటీవల మోకాళ్ళ నొప్పికి చికిత్స పొందుతూ ఇంటికే పరిమితమయ్యారు. సమాచారాన్ని అందుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక్క మధుసూదన్ రెడ్డి స్వయంగా ఓపిరెడ్డి స్వగృహానికి వెళ్లి వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు