Thursday, May 29, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిథియేటర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

థియేటర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

సినిమా టికెట్లను ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మాలి

ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;; థియేటర్ల ఆవరణములో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సినిమా టికెట్లను విక్రయించాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోనీ రంగా థియేటర్, వరలక్ష్మీ, సిద్ధార్థ థియేటర్లను వారు కలెక్టర్ ఆదేశాల మనకు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అనంతరం థియేటర్లో ఉన్న మరుగుదొడ్లను పరిసరాలను వారు పరిశీలించారు. సినిమా టికెట్లు రేట్ల విషయంలో తేడా ఉండరాదని, కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు బ్లాక్ టికెట్లను విక్రయించరాదని తెలిపారు. అదేవిధంగా అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఫైర్ సేఫ్టీ విషయంలో థియేటర్లు తప్పనిసరిగా జాగ్రత్తలు నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. అదేవిధంగా సినిమా థియేటర్లో ఉండే తినుబండారాల ఆంగళ్లను కూడా వారు పరిశీలించారు. ఎమ్మార్పీ దరకే విక్రయించాలని తెలిపారు. అదేవిధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారా? వసూలు చేస్తే రసీదు ఇస్తున్నారా? పార్కింగ్ ఫీజుకు ప్రభుత్వము నుండి అనుమతి ఉందా? అన్న విషయాలను ఆరా తీస్తూ నేరుగా వారు పరిశీలించారు. అనంతరం కొంతమంది ప్రేక్షకులను సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అడిగి నేరుగా వారే తెలుసుకున్నారు. ప్రేక్షకులకు అన్ని రకాల వసతులను థియేటర్ యజమానులు తప్పనిసరిగా సమకూర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సురేష్ బాబు, థియేటర్ యజమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు