Homeఆంధ్రప్రదేశ్ముదిగుబ్బలో మూడు కిలోల గంజాయి స్వాధీనం – 14 మంది అరెస్ట్

ముదిగుబ్బలో మూడు కిలోల గంజాయి స్వాధీనం – 14 మంది అరెస్ట్

- Advertisement -

విశాలాంధ్ర, ముదిగుబ్బ: ముదిగుబ్బ పోలీసు బృందం భారీగా గంజాయి విక్రయ, సేవించే వారిని పట్టుకొనడం ముదిగుబ్బ లో కలకలం రేపింది. ముదిగుబ్బ గ్రామ శివారులోని కాకతీయ హోటల్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన పోలీసులు సోమవారం దాడి చేసి, గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను, గంజాయి సేవిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ధర్మవరం డీఎస్పీ బి.హేమంత్‌కుమార్ తెలిపారు.ఈ పోలీసుల దాడిలో మొత్తం మూడు కిలోల గంజాయి మరియు ఒక మోటార్‌సైకిల్ స్వాధీనం చేసుకున్నామని, ముదిగుబ్బ తహసీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించిన అనంతరం ముద్దాయిలను అదుపులోకి తీసుకుని న్యాయస్థానానికి హాజరు చేసినట్లు వారు చెప్పారు. విలేకరుల సమావేశం లో డీఎస్పీ మాట్లాడుతూ అనంతపురానికి చెందిన షికారి గోవిందు వద్ద నుండి నందకుమార్, సాయి కుమార్, సాయి తేజ, నవీన్‌కుమార్ రెడ్డి, గణేష్‌లు కలిసి రూ.18 వేల రూపాయలకు ఒక కిలో గంజాయి కొనుగోలు చేసి, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి రూ.200 నుండి రూ.400కు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. “ఈ గంజాయిని సేవిస్తున్న స్థానిక యువకులు వ్యసనాల బారిన పడుతున్నారని, సమాజంలో యువత భవిష్యత్తు నాశనం అవకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి” అని సూచించారు. అరెస్టయిన వారిలో ముద్దల నంద కుమార్ (34), ముదిగుబ్బ, ముత్తన సాయి కుమార్ (19), మారాల గ్రామం – బుక్కపట్నం మండలం,మేకల సాయి తేజ (24), ఎస్‌సి కాలనీ, ముదిగుబ్బ,పోతిరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి (21), ఆర్ & బి బంగ్లా సమీపం, ముదిగుబ్బ,ముత్తన గణేష్ (24), దొరిగల్లు రోడ్, ముదిగుబ్బ,షికారి గోవిందు (38), అనంతపురం టౌన్ ,ముష్టూరు దాదాపీర్ (25), టీచర్స్ కాలనీ, ముదిగుబ్బ,ఈరామన్నగారి నిధికుమార్ (19), చెలిమిబావి వీధి, ముదిగుబ్బ,మేకల నగేష్ (31), చెలిమిబావి వీధి, ముదిగుబ్బ,సాకే పవన్ కుమార్ (21), ఎస్‌సి కాలనీ, ముదిగుబ్బ,చెన్నంపల్లి గణేష్ (19), దొరిగల్లు రోడ్, ముదిగుబ్బ,తలసూరి ప్రణవ్ కుమార్ నాయుడు (20), కస్తూర్బా కాలనీ ముదిగుబ్బ, మరియు ఇద్దరు బాలనేరస్తులు అని డి.ఎస్.పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్‌గ్రేడ్ సీఐ జి.శివరాముడు, ట్రైనీ ఎస్సై భువనేశ్వరి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

    RELATED ARTICLES
    - Advertisment -spot_img
    -Advertisement-

    తాజా వార్తలు