Homeఆంధ్రప్రదేశ్పునరావాస కేంద్రానికి

పునరావాస కేంద్రానికి

- Advertisement -

నిరాశ్రయులను పునరావాస కేంద్రానికి తరలింపు.

విశాలాంధ్ర – కడియం : ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు లోనుకాకుండా ధైర్యంగా ఉండాలని, అలాగే అధికారుల సూచనలు, జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కడియం ఎంపీడీవో కె రమేష్, తాసిల్దార్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. ముంథా తుఫాను కారణంగా  ముందస్తు చర్యలుగా నిరాశ్రయులైన కడియం మండల ప్రజల కొరకు కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలంలో ప్రమాదకర ప్రదేశాలలో ఉన్న దాదాపు 200 మంది నిరాశ్రయులను గుర్తించి ఈ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. మెడికల్ క్యాంపు, భోజన వసతి సౌకర్యాలు, పాలు, బిస్కెట్లు  సమకూర్చినట్లు తెలిపారు. అలాగే నిరాశ్రయులు ఎవరైనా ఇంకా ఉంటే కడియం హైస్కూల్ కు స్వచ్ఛందంగా రావాలని విజ్ఞప్తి చేశారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, సిఐ అల్లు వెంకటేశ్వరరావు, ఎస్ఐ ధనలక్ష్మి ప్రసన్న, ఉప సర్పంచ్ వెలుగుబంటి నాని తదితరులు పునరావాస కేంద్రాన్ని సందర్శించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు