–చలో గుంటూరు కార్యక్రమానికి తరలి వెళ్లిన వైసీపీ కాపు నాయకులు
విశాలాంధ్ర – పాయకరావుపేట: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైసీపీ ఆధ్వర్యంలో చలో గుంటూరు కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైసిపి కాపు నాయకులంతా పాయకరావుపేట మండలంలోని నామవరం సమీపంలో ఉన్న లేఔట్ లో అందరూ చేరుకొని, అక్కడి నుంచి మాజీ మంత్రి, వైసిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి గుంటూరుకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్య, కంబాల జోగులు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శులు చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయి బాబా, పార్టీ మండల అధ్యక్షులు గెడ్డమూరి శ్రీనివాసరావు, ధనిశెట్టి బాబూరావు, జగతా శ్రీను, పట్టణ అధ్యక్షులు ధనిశెట్టి సత్య మహేష్, ఎంపీటీసీ కొంత నరేష్, తమర్సి సత్యనారాయణ, సర్పంచులు పన్నీరు పాపారావు, పడాల సోమన్న దొర, మేడిశెట్టి రామ గోవిందు, పాలపర్తి సతీష్, పల్లెల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


