Homeజిల్లాలుఅనంతపురంనేడు రాచానపల్లి దర్గాషరీఫ్ (కొడిమి)గంధం - ఉరుసు మహోత్సవ

నేడు రాచానపల్లి దర్గాషరీఫ్ (కొడిమి)గంధం – ఉరుసు మహోత్సవ

- Advertisement -


విశాలాంధ్ర; అనంతపురం టౌన్
కొడిమి గ్రామంలో గంధము మహోత్సవము పూల చాందినీ లైటింగ్ డెకరేషన్, ఫక్కీర్ల జిల్లాలో ఊరేగింపు బయలుదేరి దర్గాషరీఫ్ చేరుకుంటుందని కమిటీ సభ్యులు శుక్రవారం పేర్కొన్నారు.
హజరత్ సయ్యద్ అహమ్మద్ బాద్షా ఖాద్రి శుత్తారియమనీ (ర.అలైహి) సాహెబ్ బనగానపల్లి స్వామి వారి కుమారులైన సద్గురు డా॥ హజరత్ సయ్యద్ హుస్సేన్ బాద్షా ఖాద్రి యమనీ సాహెబ్ దర్గా యందు సదింపులు జరుపుతారన్నారు. అనంతరం దర్గా వద్ద అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దర్గా వద్ద వివాహాలు ఇతర శుభకార్యక్రమాలు జరుపుకొనుటకు కనీస చార్జీలు వసూలు చేస్తూ ప్రత్యేక సౌకర్యం కల్పించబడిందన్నారు. ఈ సదావకాశంను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ దైవ కార్యక్రమములో అందరూ పాల్గొని దేవుని కృపకు పాత్రులుగుదురని హసనత్ దర్గా కమిటి, రాచానపల్లి దర్గాషరీఫ్ జయప్రదం చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు