ఫోటో రైటప్ :రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు)
కూటమి ప్రభుత్వంలోనే రైతులకు గౌరవం దక్కుతుందని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని హనుమాపురం గ్రామంలో జరిగిన మీ భూమి – మీ హక్కు ప్రభుత్వ రాజు ముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరవ రమాకాంతరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తల్లిదండ్రుల సొత్తుగా పట్టాదారు పాసు పుస్తకాలపై తన ఫోటో ముద్రించుకున్నారని మండిపడ్డారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆగ్రహానికి గురై గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారన్నారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షాన నిలబడుతుందన్నారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు గౌరవాన్ని ఇచ్చేందుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బీపీ ఈరన్న, రంగన్న, పెద్దయ్య, వీఆర్వో విక్రమ్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.


