Homeఆంధ్రప్రదేశ్రాప్తాడు బాలికకు ఆర్థిక సాయం అందించిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

రాప్తాడు బాలికకు ఆర్థిక సాయం అందించిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

- Advertisement -

రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన దాడి ఘటనలో గాయపడిన పదో తరగతి విద్యార్థిని లక్ష్మికి వైసీపీ అండగా నిలిచింది. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అనంతపురంలోని ఆసుపత్రికి వెళ్లి లక్ష్మిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ తరఫున ప్రకటించిన రూ.3 లక్షల ఆర్థిక సాయం చెక్కును లక్ష్మి కుటుంబానికి అందజేశారు.పాఠశాల తరగతి గదిలో తోటి విద్యార్థిని గోపికపై జరిగిన దాడిని అడ్డుకునేందుకు లక్ష్మి సాహసోపేతంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరింది. ఇటీవల జగన్ ఫోన్ ద్వారా లక్ష్మితో మాట్లాడి ఆమె ధైర్యాన్ని అభినందించారు. వైద్య ఖర్చులతో పాటు అన్ని విధాలా అండగా ఉంటామని ఆమె కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఆ హామీ మేరకు తోపుదుర్తి స్వయంగా వెళ్లి చెక్కును అందజేశారు.మరోవైపు, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని గోపిక కుటుంబానికి కూడా జగన్ రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. గతంలోనే ఆయన బెంగళూరు వెళ్లి గోపికను పరామర్శించిన విషయం తెలిసిందే. గోపిక కుటుంబానికి కూడా త్వరలోనే రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందజేస్తామని తోపుదుర్తి వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు