Homeఆంధ్రప్రదేశ్యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడమే తెలుగు బ్లాక్‌హాక్స్ లక్ష్యం

యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడమే తెలుగు బ్లాక్‌హాక్స్ లక్ష్యం

- Advertisement -

కేఎస్‌జీ గ్రూప్ ఛైర్మన్ కంకణాల అభిషేక్ రెడ్డి

విజయవాడ ( స్పోర్ట్స్ కరెస్పాండెంట్) : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని స్థానిక క్రీడా ప్రతిభను వెలికితీసి, యువ క్రీడాకారులకు ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించడమే తెలుగు బ్లాక్‌హాక్స్ ప్రధాన లక్ష్యమని కేఎస్‌జీ గ్రూప్ ఛైర్మన్ కంకణాల అభిషేక్ రెడ్డి తెలిపారు. కంకణాల స్పోర్ట్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు స్వాగ్ ట్రోఫీలో భాగంగా ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లోని తెలుగు బ్లాక్‌హాక్స్ జట్టుతో బ్లాక్‌హాక్స్ అకాడమీ జట్టు హోరాహోరీగా తలపడింది. గురువారం విజయవాడలోని వీ.ఆర్. సిద్ధార్థ యూనివర్సిటీలో జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో తెలుగు బ్లాక్‌హాక్స్ జట్టు 5-0తో బ్లాక్‌హాక్స్ అకాడమీ జట్టుపై ఘన విజయం సాధించింది. సెట్‌ల వారీగా 25-11, 25-14, 25-9, 15-5, 16-14 స్కోర్లతో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

ముగింపు వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన శాప్ వీసీ ఎండీ ఎస్. భ‌ర‌ణి విజేతగా నిలిచిన తెలుగు బ్లాక్ హాక్స్ జ‌ట్టుకు ట్రోఫీని బ‌హుక‌రించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విజ‌య‌వాడ‌లో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో వాలీబాల్ పోటీలు నిర్వ‌హించిన తెలుగు బ్లాక్ హాక్స్ టీమ్ య‌జ‌మాని అభిషేక్ రెడ్డిని రెడ్డిని అభినందించారు.

ఈ సందర్భంగా అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారు. అయితే వారికి సరైన వేదిక, ప్రోత్సాహం, అవకాశాలు కల్పించినప్పుడే వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ ఉద్దేశంతోనే తెలుగు బ్లాక్‌హాక్స్ తరఫున యంగ్ టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇందులో భాగంగా గత ఆగస్టులో విజయవాడలో నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్‌కు మంచి స్పందన లభించింది. అండర్-21 ట్రయల్స్‌లో 105 మంది, సీనియర్స్ ఓపెన్ ట్రయల్స్‌లో 40 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ ట్రయల్స్ ద్వారా సిరిల్ రెడ్డి (వరంగల్), విష్ణువర్ధన్ బాబు (యానం), నమిత్, మునీష్ వెంకటేశన్, దీపక్ ఐదుగురు పీవీఎల్ సీజన్-5 తెలుగు బ్లాక్‌హాక్స్ జట్టులో చోటు సంపాదించడం సంతోషంగా ఉంది. వీరిలో దీపక్ అండర్-21 ట్రయల్స్ నుంచి ఎంపిక కాగా, మిగిలిన నలుగురు సీనియర్స్ ట్రయల్స్ నుంచి ఎంపికయ్యారు. వీరంతా వచ్చే సీజన్‌లో తెలుగు బ్లాక్‌హాక్స్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. అలాగే, ఓపెన్ ట్రయల్స్ నుంచి మరో 12 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసి, బ్లాక్‌హాక్స్ అకాడమీ జట్టు తరఫున తెలుగు స్వాగ్ ట్రోఫీలో ఆడే అవకాశం కల్పించాం.

మా లక్ష్యం కేవలం ఒక జట్టును నిర్మించడమే కాదు. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం, పోటీ వేదికలు కల్పించడం. మన తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా బలమైన క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు తెలుగు బ్లాక్‌హాక్స్ నిరంతరం కృషి చేస్తుంది” అని అభిషేక్ రెడ్డి చెప్పారు.మరింత సమాచారం కోసం:95504 57149 (శ్రీహిత సొల్యూషన్స్) నెంబరను సంప్రదించాలన్నారు

యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడమే తెలుగు బ్లాక్‌హాక్స్ లక్ష్యం

– కేఎస్‌జీ గ్రూప్ ఛైర్మన్ కంకణాల అభిషేక్ రెడ్డి

విజయవాడ ( స్పోర్ట్స్ కరెస్పాండెంట్)
: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని స్థానిక క్రీడా ప్రతిభను వెలికితీసి, యువ క్రీడాకారులకు ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించడమే తెలుగు బ్లాక్‌హాక్స్ ప్రధాన లక్ష్యమని కేఎస్‌జీ గ్రూప్ ఛైర్మన్ కంకణాల అభిషేక్ రెడ్డి తెలిపారు. కంకణాల స్పోర్ట్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు స్వాగ్ ట్రోఫీలో భాగంగా ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లోని తెలుగు బ్లాక్‌హాక్స్ జట్టుతో బ్లాక్‌హాక్స్ అకాడమీ జట్టు హోరాహోరీగా తలపడింది. గురువారం విజయవాడలోని వీ.ఆర్. సిద్ధార్థ యూనివర్సిటీలో జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో తెలుగు బ్లాక్‌హాక్స్ జట్టు 5-0తో బ్లాక్‌హాక్స్ అకాడమీ జట్టుపై ఘన విజయం సాధించింది. సెట్‌ల వారీగా 25-11, 25-14, 25-9, 15-5, 16-14 స్కోర్లతో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

ముగింపు వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన శాప్ వీసీ ఎండీ ఎస్. భ‌ర‌ణి విజేతగా నిలిచిన తెలుగు బ్లాక్ హాక్స్ జ‌ట్టుకు ట్రోఫీని బ‌హుక‌రించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విజ‌య‌వాడ‌లో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో వాలీబాల్ పోటీలు నిర్వ‌హించిన తెలుగు బ్లాక్ హాక్స్ టీమ్ య‌జ‌మాని అభిషేక్ రెడ్డిని రెడ్డిని అభినందించారు.

ఈ సందర్భంగా అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారు. అయితే వారికి సరైన వేదిక, ప్రోత్సాహం, అవకాశాలు కల్పించినప్పుడే వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ ఉద్దేశంతోనే తెలుగు బ్లాక్‌హాక్స్ తరఫున యంగ్ టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇందులో భాగంగా గత ఆగస్టులో విజయవాడలో నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్‌కు మంచి స్పందన లభించింది. అండర్-21 ట్రయల్స్‌లో 105 మంది, సీనియర్స్ ఓపెన్ ట్రయల్స్‌లో 40 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ ట్రయల్స్ ద్వారా సిరిల్ రెడ్డి (వరంగల్), విష్ణువర్ధన్ బాబు (యానం), నమిత్, మునీష్ వెంకటేశన్, దీపక్ ఐదుగురు పీవీఎల్ సీజన్-5 తెలుగు బ్లాక్‌హాక్స్ జట్టులో చోటు సంపాదించడం సంతోషంగా ఉంది. వీరిలో దీపక్ అండర్-21 ట్రయల్స్ నుంచి ఎంపిక కాగా, మిగిలిన నలుగురు సీనియర్స్ ట్రయల్స్ నుంచి ఎంపికయ్యారు. వీరంతా వచ్చే సీజన్‌లో తెలుగు బ్లాక్‌హాక్స్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. అలాగే, ఓపెన్ ట్రయల్స్ నుంచి మరో 12 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసి, బ్లాక్‌హాక్స్ అకాడమీ జట్టు తరఫున తెలుగు స్వాగ్ ట్రోఫీలో ఆడే అవకాశం కల్పించాం.

మా లక్ష్యం కేవలం ఒక జట్టును నిర్మించడమే కాదు. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం, పోటీ వేదికలు కల్పించడం. మన తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా బలమైన క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు తెలుగు బ్లాక్‌హాక్స్ నిరంతరం కృషి చేస్తుంది” అని అభిషేక్ రెడ్డి చెప్పారు.మరింత సమాచారం కోసం:95504 57149 (శ్రీహిత సొల్యూషన్స్) నెంబరను సంప్రదించాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు