కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ముర్షిదాబాద్ జిల్లాలో నేడు (శుక్రవారం) విషాదకరమైన ఘటన జరిగింది. పాఠశాల వ్యాన్ను ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. కర’సువర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన సంభవించింది. తెరిచి ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద వ్యాన్ పట్టాలు దాటుతుండగా…నిమ్తీతా-కటవా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈ ప్రమాదంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులతో పాటు వ్యాన్ డ్రైవరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. పట్టాలపై వ్యాన్ నుజ్జునుజ్జు అయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు 10 మంది సభ్యుల బృందం ఘటనా స్థలానికి వెళ్లిందని తూర్పు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో లెవల్ క్రాసింగ్ గేట్ తెరిచి ఉండటంతో…విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న గేట్మ్యాన్, సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేశారు. పోలీసులు, రైల్వే వర్గాల ప్రాథమిక సమాచారం ప్రకారం…ముర్షిదాబాద్ జిల్లా పరిధిలోని ఒక రైల్వే క్రాసింగ్ వద్ద గేటు తెరిచి ఉండటంతో…రైలు రాకను గమనించని వ్యాను డ్రైవర్ వాహనాన్ని పట్టాల మీదుగా ముందుకు పోనిచ్చాడు. సరిగ్గా అదే సమయానికి అత్యంత వేగంగా దూసుకొచ్చిన రైలు ఆ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి వాహనం పూర్గిఆ నుజ్జయింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రైల్వే రక్షక దళం, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమరట్ం నిమిత్తం తరలించారు. ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బెంగాల్‌లో రైలు ప్రమాదం: ముగ్గురి మృతి
- Advertisement -
RELATED ARTICLES


