అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ట్రాన్స్కో ఏఈ
విశాలాంధ్ర–నార్పల (అనంతపురం జిల్లా) : మండల పరిధిలోని కేశేపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న మీసాల ఓబులేసు ఇంట్లో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న దుస్తులు, ధాన్యం, ఫ్రిజ్, విద్యుత్ పరికరాలు, గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో బాధిత కుటుంబానికి సుమారు రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లింది.ప్రమాద విషయం తెలుసుకున్న ఏపీ ట్రాన్స్కో ఏఈ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీసాల ఓబులేసు కుటుంబం రోజువారీ కూలీ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తోందని, అగ్నిప్రమాదంతో ఇంట్లోని వస్తువులన్నీ బూడిద కావడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు.బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి, అవసరమైన పునరావాస చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే స్థానిక ప్రజలు, అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.


