విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : పట్టణ, గ్రామ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం చేతులు, కాళ్ళలో నొప్పి, కీళ్లలో నొప్పులు వంటి వ్యాధులు సంభవిస్తున్నాయి. అయితే ఆర్థరైటిస్ ప్రాబల్యం ఇటీవల మరింత పెరిగింది. దీంతో యువతలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు.ఈ వ్యాధి లక్షణాలు మీలో కూడా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదన్నారు సకాలంలో చికిత్స చేయకపోతే ఈ వ్యాధి తీవ్రమైన సమస్యగా మారుతుంది. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలన్నారు. ముఖ్యంగా 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న వారిలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అందరిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలసట, జ్వరం, ఆకలి లేకపోవడం, కీళ్ల నొప్పులు, ఇవన్నీ ఆర్థరైటిస్నొప్పి కారణాలు. అసలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటంటే.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి. బయటి సూక్ష్మజీవుల నుంచి మానవ శరీరాన్ని రక్షించే రోగనిరోధక వ్యవస్థ దాడి చేసి శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. దీని వల్ల ఈ వ్యాధి వస్తుందని డాక్టర్ . ఎడ్ల దిలీప్ రాజ్ ఆదివారం రాజాం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఇది మన శరీరంలోని ఇతర భాగాలను ప్రభావితం చేస్తుంది. చర్మం, కళ్లు, ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాల్లో కూడా సమస్యలు రావచ్చు. అయితే ఈ వ్యాధి రావడానికి సరైన కారణం అంటూ ఏమీలేదు. పర్యావరణ కారనాలు ఈ వ్యాధికి కారణం కావచ్చన్నారు.సాధారణంగా ముసలి వయసులో కీళ్లనొప్పుల సమస్యలు వస్తుంటాయి. దీనిని వాత వ్యాధి సమస్య అంటారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ చేతులు, కాళ్ళలో నొప్పి, కీళ్లలో నొప్పులు వంటి సంభవిస్తుంటాయి. అయితే ఆర్థరైటిస్ ప్రాబల్యం ఇటీవల మరింత పెరిగిందని, ఈ వ్యాధికి తగిన చికిత్స ప్రస్తుతం రాజాంలో అందుబాటులో తెచ్చామని, మెయిన్ రోడ్డు అక్షయ గ్రాండ్ హోటల్ లో వెనుక లో ఉన్న 10 నెంబర్ షాప్ లో ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అందుబాటులో ఉంటామని, ఈ అవకాశాన్ని రాజాం పరిసర ప్రాంత ప్రజల వినియోగించుకోవాలని డాక్టర్ ఎడ్ల దిలీప్ రాజ్ తెలిపారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధికి రాజాంలో అందుబాటులో వైద్యం
- Advertisement -
RELATED ARTICLES


