మానవతా సంస్థ అధ్యక్షుడు జగ్గా వేణుగోపాల్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలని మానవతా సంస్థ అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు శివానగర్లోని శివాలయం కాంపౌండ్ నందు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మానవతా సంస్థ ఆశయాల గురించి సేవా కార్యక్రమాలు గురించి సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, ఉపాధ్యక్షులు మంజునాథ్, డైరెక్టర్లు జింక చిన్నప్ప, సోమేశ్వర రెడ్డి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మానవతా సంస్థలో సభ్యత్వం లేని వారు సభ్యత్వం తీసుకోవాలని, ఎక్కువ సంఖ్యలో సభ్యులు నమోదు చేయించుకోవాలని తెలిపారు. సంస్థ డైరెక్టర్ , సత్యసాయి జిల్లా యోగ అధ్యక్షులు సోమేశ్వర రెడ్డి మాట్లాడుతూ సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో అందరూ కలిసి రావాలని, యోగసాధన నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని తెలిపారు.
ఏవైనా సేవా కార్యక్రమాల ఆవశ్యకత ఉన్నట్లయితే తెలపాలని సంస్థ కార్యవర్గ సమావేశంలో చర్చించిన తరువాత అవకాశం ఉన్న సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా శివా నగర్ లో నివసించే మానవతా సభ్యుడు, సంస్థ కార్యక్రమాలలో చేదోడుగా ఉంటున్న ఎన్. విష్ణుమాయను సత్కరించారు. ఈ
కార్యక్రమంలో సంస్థ సభ్యుడు రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలి..
- Advertisement -
RELATED ARTICLES


