Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ధర్మవరం బాలిక ఎంపిక

జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ధర్మవరం బాలిక ఎంపిక

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం; పంజాబ్ రాష్ట్రంలో లూథియానా నగరంలో సెప్టెంబర్ రెండవ తేదీ నుండి సెప్టెంబర్ 9వ తేదీ వరకు జరిగే 75వ జూనియర్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టుకు ధర్మవరం పట్టణానికి చెందిన బి . నీఖ్యశ్రీ ఎంపికైందని ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రెటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట స్థాయిలో ఈ నెల ఆగస్టు 14 తేదీ నుండి 17 తేదీ వరకు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో జరిగిన ఇంటర్ డిస్టిక్స్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ జట్టు లో బి.నీఖ్యశ్రీ స్థానం సంపాదించి, రాణించి, నేడు రాష్ట్ర జట్టుకు ఎంపిక అవడం గర్వకారణం అని ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రెటరీ జయ చంద్రారెడ్డి తో పాటు ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి, సెక్రటరీ వాయల్పాడు హిదాయతుల్లా, కోచ్ సంజయ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.జాతీయ స్థాయిలో స్థాయిలో వీరు రాణించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు