విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం పట్టణానికి చెందిన మునిసిపల్ ఉపాధ్యాయలు ఆర్. రామకృష్ణ నాయక్
శ్రీ సత్య సాయి జిల్లా, పరిగి మండలం లోని ZPHS బాలుర ఉన్నత పాఠశాల సేవా మందిర్ నందు జరిగిన జిల్లా యుటిఎఫ్ సమావేశంలో ఆర్. రామకృష్ణ నాయక్ను జిల్లా కార్యదర్శిగా ఎన్నిక చేసినట్లు రాష్ట్ర కార్యదర్శి ,జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్. రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల రాజీ లేని పోరాటాన్ని కొనసాగిస్తానని, మునిసిపల్ ఉపాధ్యాయుల సమస్యలతో పాటు అన్నీ ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయుల సమస్యల సాధనకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. తనను జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రామక్రిష్ణ నాయక్ జిల్లా కార్యదర్శిగా ఎంపిక పట్ల రాష్ట్ర కార్యదర్శి , శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి తో పాటు, ధర్మవరం యుటిఎఫ్ జోన్ నాయకులు లక్ష్మయ్య, అమర్ నారాయణ రెడ్డి, సకల చంద్రశేఖర్, సురేష్, రమేశ్, సాయి గణేష్, ఆంజనేయులు, రామాంజనేయులు, రాంప్రసాద్, నాగి రెడ్డి,
హరి శంకర్, మేరీ వరకుమారి, లతాదేవి, నాగేంద్రమ్మ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
యుటి ఎఫ్ శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శిగా ఆర్. రామకృష్ణ నాయక్ ఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


