విశాలాంధ్ర ధర్మవరం ; మండల ఏపీటీఎఫ్ శాఖ కార్యవర్గాన్ని స్థానిక ఎన్జీవో హోం లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ ధర్మవరం మండల శాఖ కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా కె .బలరాముడు వ్యవహరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కోడూరు శ్రీనివాసులు మాట్లాడుతూ వెంటనే పిఆర్సి కమిటీ నియమించి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డి ఏ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర నాయకులు బి కే ముత్యాలప్ప మాట్లాడుతూ నూతన మూల్యాంకన విధానాన్ని రద్దుచేసి ఉపాధ్యాయులకు బోధన చేసే అవకాశాన్ని కల్పించాలని తెలియజేశారు. ఎన్నికల అధికారి కే బలరాముడు జిల్లా ఉపాధ్యక్షులు సానే రవీంద్ర రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా ఎం.బయన్న, అధ్యక్షులుగా జి. శివానంద, ప్రధాన కార్యదర్శిగా కే. ఈశ్వరయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా లక్ష్మీ నరసయ్య, భవాని, సంజీవప్ప, చంద్రశేఖర్,కవిత కార్యదర్శులుగా శ్రీరంగ ప్రసాద్, ఆదినారాయణ, స్వరూప, సి. ఆదినారాయణ, పెద్ద ఓబులేష్ జిల్లా కౌన్సిలర్స్ గా నాగరాజు, తిప్పన్న, హేమంత్ కుమార్, శంకర్ నారాయణ, కళావతి, వాసు కుమార్ ,ఆడిట్ కమిటీ కన్వీనర్ గా గురుమూర్తి, ఆడిట్ కమిటీ సభ్యులుగా కుళ్లాయప్ప, వెంకటేష్ నాయక్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కే. బలరాముడు అధికార పూర్వకంగా ప్రకటించారు. మండలంలోని ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించుటకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివానంద, ఈశ్వరయ్య తెలియజేశారు.
ఏపీటీఎఫ్ ధర్మవరం మండల శాఖ కార్యవర్గం ఎన్నిక
- Advertisement -
RELATED ARTICLES


